High Court on Houses in Capital: రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్లో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్థలాల కేటాయింపునకు వీలుగా 2020లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తుది విచారణ అక్టోబర్ 21కి వాయిదా పడింది. రైతులు కొందరు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేసిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ప్రకటించింది. సీఆర్‌డీఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద స్థలాలు కేటాయించేందుకు వీలుగా 2020 ఫిబ్రవరి 25న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 107ను సవాలు చేస్తూ రైతు ఎ.నందకిశోర్, జి.హరిగోవింద ప్రసాద్, కొల్లి సాంబశివరావు తదితరులు అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం.. జీవో 107 అమలును నిలిపివేసింది. రాజధాని ప్రాంతంలో రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జోనల్ రెగ్యులేషన్ విధానానికి, సీఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది
అది నా పరిధికి మించిన వ్యవహారం: అదనపు ఏజీ