అమరావతి భూముల ఆంశంపై హైకోర్టులో విచారణ వాయిదా - రాజధానికి భూములిచ్చిన రైతుల అంశంపై హైకోర్టులో విచారణ
12:02 September 30
రాజధానికి భూములిచ్చిన రైతుల అంశంపై హైకోర్టులో విచారణ... వచ్చే గురువారానికి విచారణ వాయిదా వేసిన ధర్మాసనం
రాజధానికి భూములిచ్చిన కొందరు రైతులకు కౌలు ఇవ్వలేదని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కొంతమంది రైతులకు కౌలు ఇచ్చి మిగతా వారికి ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ.లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. కౌలు విడుదలకు ఇప్పటికే జీవో ఇచ్చామని ఏఆర్‌ఎండీ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే గురువారంలోపు కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి ధర్మాసనం వాయిదా వేసింది.
ఇదీ చదవండి : కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం బొమ్మ ముద్రణపై హైకోర్టులో పిటిషన్