ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవినేని ఉమా పిటీషన్​పై హైకోర్టులో విచారణ.. మంగళవారానికి వాయిదా

మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. జి.కొండూరు పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. కోర్టు.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

hc on devineni uma petition
దేవినేని ఉమా పిటీషన్​పై హైకోర్టులో విచారణ

By

Published : Jul 31, 2021, 3:08 AM IST

కృష్ణా జిల్లా జి.కొండూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ.. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదుదారు ఆరోపిస్తున్నట్లు ఏ నేరానికి పాల్పడలేదని దేవినేని ఉమ తరపు న్యాయవాది వాదించారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారన్నారు. ఫిర్యాదుదారు ఎవరో .. అతను ఏ సామాజిక వర్గమో తనకు తెలియదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details