రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని కొనసాగించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ.. దాఖలైన పిల్‌ను హైకోర్టు పరిష్కరించింది. ఎస్ఈసీ(sec) నియామకంపై ఇప్పటికే సింగిల్ జడ్జి విచారణ జరుపుతున్నారని.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల అప్పీళ్లు ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో ఇదే వ్యవహారంపై మరో పిల్ అవసరం లేదని పేర్కొంది. ఆ పిల్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎస్ఈసీగా విశ్రాంత ఐఏఎస్ అధికారి నీలం సాహ్నిని ఎస్ఈసీగా కొనసాగడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ గుంటూరుకు చెందిన డాక్టర్ మద్దిపాటి శైలజ హైకోర్టులో పిల్ వేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎస్ఈసీ నీలం సాహ్ని రూ. 180 కోట్ల ప్రజాధనం వృథా చేశారని.. ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టాలని శైలజ కోరారు.
high court on sec: నీలం సాహ్ని నియామకంపై మరో పిల్ అవసరం లేదు: హైకోర్టు - sec Neelam Sahni latest news
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకంపై మరో పిల్ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. ఎస్ఈసీ(sec)గా నీలం సాహ్ని కొనసాగించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు పరిష్కరించింది.

నీలం సాహ్ని నియామకంపై మరో పిల్ అవసరం లేదు
Last Updated : Aug 1, 2021, 4:00 AM IST