ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‘బిల్లు’ తర్వాత పరిణామాల్ని తెలపండి: పిటిషనర్‌ను కోరిన హైకోర్టు - high court on pil

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు కొనసాగుతున్నాయని... ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది ఆర్. మహంతికి హైకోర్టు గుర్తు చేసింది. ఎన్నికలు జరపాలని నవంబర్​లో ఇచ్చిన ఉత్తర్వులను.. ఇన్ని రోజుల జాప్యం తరువాత సవాలు చేయటం ఏమిటని ప్రశ్నించింది.

high court
హైకోర్టు

By

Published : Feb 9, 2021, 9:19 AM IST

ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) గతేడాది నవంబర్‌ 17న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌/న్యాయవాది ఆర్‌.మహంతి వాదనలు వినిపిస్తూ.. అధికరణ 243(కే) ప్రకారం పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాల్ని సవరించారన్నారు. దీని ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితోనే ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని.. స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నవంబర్‌ 17న ఇచ్చిన ఉత్తర్వులను ఇన్నిరోజులు జాప్యంతో సవాలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరి.. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలు కొనసాగుతున్నాయని గుర్తుచేసింది. ‘2016లో పార్లమెంట్‌లో బిల్లు పెడితే ఏమైంది. ఆ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిందా? ఆ తర్వాత అధికరణ 243(కే)ను సవరించారా?’ తదితర వివరాలేవి లేకుండా ఎలా జోక్యం చేసుకోగలం అని వ్యాఖ్యానించింది. బిల్లు తర్వాత పరిణామాల్ని కోర్టుకు తెలపాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details