ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: 'నెల రోజుల్లో పెండింగ్ బిల్లుల్ని చెల్లిస్తాం' - హైకోర్టు తాజా వార్తలు

ఉపాధి హామీ పెండింగ్ నిధులు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు ఐఏఎస్​లు రావత్, గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ హాజరయ్యారు.

ఉపాధి హామీ పెండింగ్ నిధులు చెల్లింపుపై హైకోర్టులో విచారణ
ఉపాధి హామీ పెండింగ్ నిధులు చెల్లింపుపై హైకోర్టులో విచారణ

By

Published : Aug 18, 2021, 12:54 PM IST

Updated : Aug 19, 2021, 5:37 AM IST

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బకాయిలు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌...హైకోర్టుకు హాజరయ్యారు. గత విచారణలో ద్వివేది, గిరిజాశంకర్ మాత్రమే హాజరుకావడంపై సీజే ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ సారి విచారణకు రావత్‌ కూడా వచ్చారు. సీజే సెలవులో ఉండటంతో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం ఈ విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 5 లక్షల లోపు పనుల బకాయిలను ఇప్పటికే చెల్లించామని ప్రభుత్వ తరపు న్యాయవాది సుమన్‌ వాదించారు. 5 లక్షలకు పైబడి చేసిన పనులకు 1,117 కోట్లు చెల్లించాల్సి ఉందని, 513 కోట్లు మంజూరు చేసినట్లు ఇటీవల కేంద్రం నుంచి సమాచారం వచ్చిందన్నారు. ఆ సొమ్ము రాగానే మిగిలిన వారికీ చెల్లిస్తామని చెప్పారు. అయితే ఈ నెల 24న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు హాజరై వివరాలు చెప్పాలని అధికారులకు న్యాయస్థానం సూచించింది. విచారణను వాయిదా వేసింది.

Last Updated : Aug 19, 2021, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details