ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉస్మానియా ఆసుపత్రి సైట్​ ప్లాన్​ సమర్పించండి: తెలంగాణ హైకోర్టు - తెలంగాణ హైకోర్టు వార్తలు

ఉస్మానియా ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించింది. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. దాన్ని కూల్చివేసి నూతన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని కొందరు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

high-court-hearing-on-osmania-hospital
తెలంగాణ హైకోర్టు

By

Published : Aug 31, 2020, 3:21 PM IST

ఉస్మానియా ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారించింది. ఉస్మానియా పురాతన భవనం కూల్చవద్దని న్యాయవాదులు వాదనలు వినిపించారు. భవనం కూల్చకుండా పక్కనే భవనం నిర్మించవచ్చని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన న్యాయస్థానం.. ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరి రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. దాన్ని కూల్చివేసి నూతన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని కొందరు వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. పురాతన భవనాన్ని కూల్చవద్దని.. ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details