ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లను వెబ్‌సైట్లో ఉంచకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ఈ-గెజిట్ వెబ్‌సైట్లో ఉత్తర్వులను ఉంచేందుకు ఈనెల 7న తాజాగా ఇచ్చిన జీవో 100 ప్రతిని పిటిషనర్లకు అందజేయాలని స్పష్టంచేసింది. అత్యంత రహస్యం, రహస్యం, గోప్యం అనే పేరిట ఏపీ ఈ-గెజిట్‌లో జీవోలు ఉంచకూడదనే నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏమిటా రహస్య జీవోలని ఆరా తీసింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ... సంతకాలు లేని జీవోలను గతంలో ‘జీవోఐఆర్’ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసేవారన్నారు. గతంలో మాదిరి ఇకమీపైనా ఏపీఈ-గెజిట్ వెబ్‌సైట్లో జీవోలు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈమేరకు జీవో 100 జారీ చేసిందన్నారు. గతంలోనూ రహస్య జీవోలను వెబ్‌సైట్లో పెట్టలేదన్నారు. తమ నిర్ణయం తాజాగా తీసుకున్నదేం కాదన్నారు. ఏపీ సచివాలయ ఆఫీసు మాన్యువల్, ఏపీ ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
HC: ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ - ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టు విచారణ వార్తలు
14:34 September 13
ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ
ధర్మాసనం స్పందిస్తూ... ఎప్పుడో రూపొందించిన నిబంధనల ప్రకారం నడుచుకుంటామంటే ఎలా? ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు వాటిని సవరించాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తంచేసింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం జీవో 100 జారీచేసిన నేపథ్యంలో వ్యాజ్యాల్లోన్ని అభ్యర్థనలను సవరించుకునేందుకు పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. జీవోలను వెబ్‌సైట్లో ఉంచడకపోవడాన్ని సవాలు చేస్తూ... జీఎంఎన్‌ఎస్ దేవి, గుంటూరు జిల్లాకు చెందిన కోమటినేని శ్రీనివాసరావు, న్యాయవాది ఎస్‌ఆర్ ఆంజనేయులు హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫు న్యాయవాదులు శ్రీకాంత్, కారుమంచి ఇంద్రనీల్‌బాబు, వై.బాలాజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధం అన్నారు. ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాలను తెలుసుకునే ప్రాథమిక హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008 నుంచి కొనసాగుతున్న విధానాన్ని నిలిపివేయడం సరికాదన్నారు.
ఇదీ చదవండి