ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT: ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై హైకోర్టులో విచారణ

high court
high court

By

Published : Sep 29, 2021, 6:32 PM IST

Updated : Sep 30, 2021, 2:20 AM IST

18:29 September 29

అక్టోబర్ 8న తుది తీర్పు వెలువరించనున్న హైకోర్టు

   ఉపాధి పనుల్లో విజిలెన్స్ విచారణ విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని హైకోర్టు పేర్కొంది. విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు కేంద్రానికి తెలిపి ... ఇంకా పూర్తి కానందున ఉపాధి బిల్లుల్లో 21 శాతం సొమ్మును పట్టి ఉంచామని  కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఇటీవల కోర్టు విచారణకు హాజరై విజిలెన్స్ విచారణ జరగడం లేదని చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. వ్యాజ్యాలపై వాదనల కోసం విచారణను అక్టోబర్ 4 కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జట్టు దేవానంద్  ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత హాయంలో జరిగిన ఉపాధి హామీ పనులకు పిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టులో సుమారు 500 పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. కోర్టు ఆదేశాల మేరకు కొందరికి 79 శాతం బకాయిలు చెల్లించిన అధికారులు .. విజిలెన్స్ విచారణ పేరు చెప్పి 21 శాతం బకాయిలను విత్ హోల్డ్ లో ఉంచారు. తాజాగా జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తూ .. విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని తెలిపింది.  

ఇదీ చదవండి

Pawan Fiers on YCP: వైకాపాపై పవన్ ఫైర్.. కోడికత్తి మూకలకు భయపడనంటూ వార్నింగ్

Last Updated : Sep 30, 2021, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details