పంచాయతీ ఎన్నికలపై విచారణ ముగించిన హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి. ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టును ఆశ్రయించగా...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ వాదనలు వినిపించాయి. ఈ కేసులో ఉపాధ్యాయులు, ఉద్యోగుల తరఫున దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
పంచాయతీ ఎన్నికలపై తీర్పు రిజర్వు - హైకోర్టు వార్తలు
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ఇవాళ కూడా విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు పలు కీలక అంశాలను విచారణ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని, ఆంక్షల సడలింపులో ఐదో దశలో ఉన్నామని వివరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే ఎవరి కార్యకలాపాలు వారు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో కరోనా క్రమేపీ తగ్గుతోందన్నారు. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించటానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదని ప్రస్తావించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నిలపై హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇదీ చదవండి:దేవినేని ఉమ అరెస్టు.. గొల్లపూడిలో టెన్షన్ టెన్షన్