ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయాధికారి రామకృష్ణ పిటిషన్​పై.. కౌంటర్​కు విద్యార్థి సమాఖ్యకు అనుమతి - high court red zone news

హైకోర్టును కరోనా రెడ్‌జోన్‌గా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ న్యాయాధికారి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ వేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్యకు హైకోర్టు అనుమతిచ్చింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

న్యాయాధికారి రామకృష్ణ పిటిషన్​పై.. కౌంటర్​కు విద్యార్థి సమాఖ్యకు అనుమతి
న్యాయాధికారి రామకృష్ణ పిటిషన్​పై.. కౌంటర్​కు విద్యార్థి సమాఖ్యకు అనుమతి

By

Published : Aug 8, 2020, 4:22 AM IST

హైకోర్టును కరోనా రెడ్​జోన్​గా ప్రకటించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని కోరుతూ న్యాయవాది రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్​పై కౌంటర్​ వేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్యకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు హైకోర్టు తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలు చేశారని.. దానిని అనుమతించాలని కోరారు.

దీనిపై తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఆ పిటిషన్​ను హైకోర్టు అనుమతించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన వ్యాజ్యం వెనుక జస్టిస్​ ఈశ్వరయ్య హస్తం ఉందని న్యాయాధికారి రామకృష్ణ అన్నారు. మరిన్ని సాక్ష్యాలు కోర్టు ముందు ఉంచేందుకు అనుమతివ్వాలని ఆయన అభ్యర్థించారు.

స్పీకర్​ వ్యాఖ్యలు నిందాపూర్వక స్వభావమే: ఆర్​జీ

'కుటిల ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనం పొందాలని పిటిషన్ ను అసోసియేషన్ పేరుతో దాఖలు చేశారు. పంచాయతీ కార్యాలయాలకు అధికారపార్టీ జెండా రంగులు, అన్ని పాఠశాలల్ని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, మరికొన్ని విషయాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సామాజిక మాధ్యమం వేదికగా కొంత మంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు విమర్శలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు, అధికారపార్టీ మాజీ ఎమ్మెల్యే, మరికొందరు న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేసేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు న్యాయమూర్తులపై నిందాపూర్వకమైన విమర్శలు చేసినందుకు హైకోర్టు సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగ్​లను నిలువరించేందుకు కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించేలా హైకోర్టు ఇన్​స్టిట్యూషనల్ హోదాలో మరో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ రెండు వ్యాజ్యాలు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్​లో ఉన్నాయి.

ఈ ఏడాది జులై 2 న ' డెక్కన్ క్రానికల్ ' దినపత్రిక ప్రచురించిన వార్తా కథన సారాంశం ప్రకారం.. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హైకోర్టుపై చేసిన వ్యాఖ్యలు.. నిందాపూర్వక స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను ఆంగ్ల, స్థానిక భాష దినపత్రికలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచురించాయి. అవి న్యాయవ్యవస్థను తక్కువ చేసేవిగా ఉన్నాయి. ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ లెటర్ హెడ్​తో ఏపీ హైకోర్టు సీజేపై ఆరోపణల్ని ఆపాదిస్తూ రాష్ట్రపతి, సుప్రీంకోర్టు సీజే, జడ్జిలకు ఫిర్యాదు చేసింది. లెటర్ హెడ్ ప్రకారం జస్టిస్ ఈశ్వరయ్య ఆ ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ ఫిర్యాదులోని కొన్ని అంశాలు.. 'హైకోర్టు సీజేకు అపఖ్యాతి తెచ్చేలా ఉన్నాయి. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను పోలిన అంశాలతో 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య' దాఖలు చేసిన అఫిడవిట్​లోని అంశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు సంఘాల, సభ్యుల, జస్టిస్ ఈశ్వరయ్య సంబంధాన్ని తోసిపుచ్చలేం. హైకోర్టు, న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాల్జేయడానికి పిల్ దాఖలు చేయడం మరో ప్రయత్నం. దురుద్దేశంతో దాఖలు చేసిన పిల్ ఇది కొట్టేయండి'... అని ఆర్జీ తన అఫిడవిట్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

రాజధానిలో కేంద్రం పాత్ర లేదనడం.. రాజ్యాంగ ఉల్లంఘనే..!

ABOUT THE AUTHOR

...view details