ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GO-2 : 'జీవో-2 ఉపసంహరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' - HIgh court

జీవో -2 ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది శివాజీ హైకోర్టుకు తెలిపారు. పురోగతి తెలిపేందుకు కొంత సమయం కోరారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Jan 5, 2022, 4:21 AM IST

గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు అప్పగిస్తూ...జారీ చేసిన జీవో-2 ఉపసంహరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది శివాజీ హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంపై పురోగతి తెలిపేందుకు కొంత సమయం కావాలన్నారు. మరోవైపు ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం వేసిన అనుబంధ పిటిషన్​పై విచారణ అవసరం లేదని పేర్కొన్నారు.

ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయామూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అనుబంధ పిటిషన్​పై విచారణ నిలిపివేశారు. ప్రధాన వ్యాజ్యంపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. సర్పంచుల అధికారాలను వీఆర్వోలకు కట్టబెడుతూ గతేడాది మార్చి 25 న ప్రభుత్వం జారీ చేసిన జీవో-2ను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదీచదవండి.

ABOUT THE AUTHOR

...view details