బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు సమకూర్చటంలో కేంద్ర ప్రభుత్వం సరిగా వ్యవహరించటం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజాన వ్యాజ్యాలపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. కేంద్రప్రభుత్వ అపిడవిట్‌ను పరిశీలించిన హైకోర్టు.. బ్లాక్ ఫంగస్ రోగులకు అందించాల్సిన ఇంజక్షన్ల సరఫరా చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడింది. ఇంజక్షన్ల తయారీకి అవసరమైన ముడిసరుకు లభ్యత తక్కువగా ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇంజక్షన్లు తయారు చేస్తున్నట్లు.. కేంద్రప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.
బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై హైకోర్టు విచారణ... కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి - black fungus medicine scarcity in ap
రాష్ట్రంలో కొవిడ్, బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజాన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిగింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరతపై ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఇంజెక్షన్ తయారీకి ముడిసరకు లభ్యత తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. సోమవారం నాటికి పూర్తి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ల కొరతపై హైకోర్టు విచారణ
రాష్ట్రంలో 9 లక్షలకుపైగా డోసులు అవసరమని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కేవలం 2 లక్షల 17 వేల డోసులే సరఫరా చేస్తున్నారన్నారు. రోగులకు అవసరమైన మేర మందులు సరఫరా చేయాలని హైకోర్టు సూచించింది. ఏ రాష్ట్రానికి ఎంతమేర సరఫరా చేశారో వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సోమవారం నాటికి పూర్తి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: