ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Anandaiah Medicine: 3 నెల‌ల త‌ర్వాతే.. ఆనంద‌య్య చుక్క‌ల‌ మందు..!

ఆనందయ్య కంటి చుక్కల మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టెరిలిటీ టెస్టుకు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పూర్తి నివేదిక వచ్చేవరకు చుక్కల మందు తప్ప మిగిలిన మందుల పంపిణీకి అభ్యంతరం లేదని ధర్మాసనానికి వివరించింది.

Anandaiah
Anandaiah

By

Published : Jun 3, 2021, 2:24 PM IST

Updated : Jun 3, 2021, 8:35 PM IST

ఆనందయ్య కంటిచుక్కల మందు పంపిణీపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. కంటిమందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాలని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటిమందుకు అనుమతి ఇవ్వలేమని వివరించింది. అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి కంటిమందుకు అనుమతిస్తారా అని కోర్టు ప్రశ్నించగా.. అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం తెలిపింది.

ఆనందయ్య తరఫు న్యాయవాది బాలాజీ

రోజుకు 15 నుంచి 20 మందే వస్తున్నారని ఆనందయ్య తరఫు న్యాయవాది బాలాజీ కోర్టుకు చెప్పారు. ఆనందయ్య మందును తాము వ్యతిరేకించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటిమందు తప్ప మిగతా వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఉన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. కంటిమందుకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా లేమన్న ప్రభుత్వం.. నివేదిక వచ్చే వరకు 3 వారాల సమయం కావాలని హైకోర్టును కోరింది.

Last Updated : Jun 3, 2021, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details