రాజధానికి సంబంధించిన వివిధ అంశాలపై దాఖలైన వ్యాజ్యాలు నేడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, కార్యాలయాల తరలింపు, ఆర్5 జోన్ పేరిట ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై ఇప్పటిదాకా మొత్తం 56 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విధించిన స్టేటస్ కో నేటితో ముగియనుంది. యథాతథ స్థితిని ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేయటంతో... నేటి హైకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సర్వత్రా ఉత్కంఠ.. రాజధాని పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ - ఏపీ రాజధాని ఇష్యూ
రాజధానికి సంబంధించిన పలు కీలక అంశాలపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు, కార్యాలయాల తరలంపు, ఆర్5 జోన్ అంశాలపై హైకోర్టులో మొత్తం 56 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. కార్యాలయాల తరలింపుపై హైకోర్టు విధించిన స్టేటస్కో నేటితో ముగుస్తుంది. దీంతో హైకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సర్వత్రా ఉత్కంఠ.. రాజధాని పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ
కరోనా నేపథ్యంలో కేసుల విచారణ అంతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయని.... ఇలాంటి కీలక అంశాలపై ప్రత్యక్ష పద్ధతిలో విచారించాలని పలువురు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. మరికొందరు దిల్లీ నుంచి వచ్చేందుకు కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ధర్మాసనం నేడు నిర్ణయం తెలిపే అవకాశముందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి :సీబీఐ అధికారులపై మహిళా ఎస్సై గూఢచర్యం!