రాజధానికి సంబంధించిన వ్యాజ్యాలు నేడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ ఎస్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై విచారణ జరపనుంది. వేసవి సెలవులకు ముందు వ్యాజ్యాలు త్రిసభ్య బెంచ్ ముందుకు రాగా ఏ పిటిషన్లను ఏ విధంగా విచారించాలో చర్చించారు. వేసవి సెలవుల తర్వాత విచారణ జరుపుతామని బెంచ్ నిర్ణయించింది. ఓసారి విచారణ ప్రారంభమయ్యాక వరుసగా విచారణ జరుపుతామని తెలిపింది.
HIGH COURT : రాజధాని వ్యాజ్యాలపై నేడు విచారణ - high court hearing on amaravathi capital petitions
పాలనవికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ... దాఖలైన పలు వ్యాజ్యాలు నేడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. ఓసారి విచారణ ప్రారంభమయ్యాక వరుసగా విచారణ జరుపుతామని త్రిసభ్య బెంచ్ తెలిపింది.

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టం, కార్యాలయాల తరలింపునకు సంబంధించిన వ్యాజ్యాలను బెంచ్ విచారించనుంది. పాలన వికేంద్రీకరణ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత హైకోర్టులో అమరావతి రైతులు, మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో హైకోర్టు సీజే గా ఉన్న జస్టిస్ జె.కె.మహేశ్వరి ఈ వ్యాజ్యాలను విచారించారు. తుది దశకు చేరుకునే సమయంలో అప్పటి ఆయన బదిలీ కావడంతో వ్యాజ్యాలను మళ్లీ విచారిస్తున్నారు. కొందరు పిటిషనర్లు హైబ్రీడ్ పద్ధతుల్లో విచారణ జరపాలని గతంలో కోరారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆన్‌లైన్ విధానంలో విచారణ జరుతున్నారు.
ఇదీచదవండి