AP High Court on Right to Education Act: విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయించాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీఈ(Right to Education Act) చట్ట నిబంధనల మేరకు వ్యవహరించాలని తేల్చిచెప్పింది. ఈ వ్యహారంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలు, కోర్టుధిక్కరణ కేసులను న్యాయస్థానం పరిష్కరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఆర్టీఈ చట్టం సెక్షన్ 12(1)(సి) ప్రకారం అర్హులైన పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆ నిబంధన అమలు కావడం లేదని పేర్కొంటూ.. న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో పిల్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ నేరుగా వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల ఏటా లక్షల మంది పేద విద్యార్థులు ఆర్టీఈ(RTE) చట్ట కల్పించిన హక్కుల నిరాకరణకు గురవుతున్నాయి. 25 శాతం సీట్ల విషయంలో సుప్రీంకోర్టు సైతం చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పిందన్నారు.