High Court: తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కురకాల్వ గ్రామంలో తమకు చెందిన 3.32 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్కు కోసం రేణిగుంట తహసీల్దార్ వెనక్కి తీసుకోవడాన్ని సవాలు చేస్తూ తిరుపతి గ్రామీణ మండలం మంగళం గ్రామానికి చెందిన కె.నాగవేణి, డి.మహేశ్వరి, ఎన్.పుష్ప 2018లో హైకోర్టును ఆశ్రయించారు. అది ఎసైన్డ్ భూమి అని, ప్రజాహితం కోసం దానిని వెనక్కి తీసుకున్నామని, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని రెవెన్యూ అధికారులు పేర్కొనడంపై అభ్యంతరం తెలిపారు. ప్రజా ప్రయోజనం కోసం భూమిని తిరిగి తీసుకున్నప్పుడు ప్రైవేటు పట్టాదారులతో సమానంగా పిటిషనర్లకు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని న్యాయవాది సురేశ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఏజీపీ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
" ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. పరిహారం చెల్లించాల్సిందే" - తిరిగి తీసుకున్న ఎసైన్డ్ భూమికి పరిహారం చెల్లించాన్న హైకోర్టు
High Court: ప్రజావసరాల కోసం ఎసైన్డ్ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే.. ప్రైవేటు పట్టా భూములకు ఇచ్చినట్లే పరిహారం చెల్లించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు.
హైకోర్టు
"ప్రజాహితం కోసం భూమిని వెనక్కి తీసుకుంటున్నప్పుడు పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు పట్టా భూములకు మాదిరి ఎసైన్డ్ భూములకు భూసేకరణ చట్ట నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. పిటిషనర్లకు 6 నెలల్లో సొమ్ము చెల్లించండి" అని న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి తీర్పు ఇచ్చారు.
ఇవీ చదవండి: