జడ్జి ఎస్ రామకృష్ణకు(judge ramakrishna) హైకోర్టు(high court) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. రఘునందన్‌రావు మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఈ కేసుకు సంబంధించి మీడియా ముందు వ్యాఖ్యలు చేయవద్దని జడ్జి రామకృష్ణకు స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారులు కోరినప్పుడు విచారణకు హాజరు కావాలని..రెండు పూచీకత్తులతో రూ.50వేలు సమర్పించాలని పేర్కొన్నారు.
High court: జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు.. కానీ షరతులు! - జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు న్యూస్
11:30 June 15
రూ.50 వేల పూచీకత్తుతో బెయిల్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన జడ్జి ఎస్ రామకృష్ణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ...ముఖ్యమంత్రిపై పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం నేరం కిందకు రావన్నారు. ఏప్రిల్ 15న జడ్జి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. 60రోజులకు పైగా జైల్లో ఉన్నారన్నారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) శ్రీనివాసరెడ్డి వాదిస్తూ..పిటిషనర్ పబ్లిక్ సర్వెంట్ అయి టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వీసు నిబంధనలకు విరుద్దమని, ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. మీడియా ముందుకు వెళ్లకుండా నిలువరిస్తూ..గ్యాగ్ అర్డర్ ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ..గ్యాగ్ ఆర్డర్ ఇవ్వలేమన్నారు. ఆ విధమైన ఉత్తర్వులు ప్రాథమిక హక్కులను హరించడం అవుతుందన్నారు. ఈకేసు విషయంలో మాత్రమే మీడియా వద్దకు వెళ్లకుండా నిలువరిస్తామన్నారు.
ఇదీ చదవండి:
Firing: కాల్చి చంపాడు.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!