ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిరసన హక్కును కాలరాయవద్దంటూ పది కీలక ఆదేశాలు - high court on police act

high-court-fire-on-144-section
అమరావతిలో 144 సెక్షన్​పై హైకోర్టు ఆగ్రహం

By

Published : Jan 13, 2020, 3:32 PM IST

Updated : Jan 14, 2020, 5:50 AM IST

15:30 January 13

144 సెక్షన్​పై హైకోర్టు ఆగ్రహం

మీడియాతో హైకోర్టు న్యాయవాది


అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న రైతులు,...మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించింది . ఈనెల 12,13 తేదీల్లో... ఈనాడు దినపత్రికల్లో ప్రచురితం అయిన కథానాలు, ఫోటోలను సుమోటోగా తీసుకొని ప్రజాహిత వ్యాజ్యంగా మలిచిన ధర్మాసనం ఇదే అంశంపై దాఖలైన పలు వ్యాజ్యాలతో కలిపి అత్యవసరంగా విచారణ జరిపింది. మొదట 'సుమోటో పిల్ పై విచారణ జరిపిన ధర్మాసనం....... చట్టాలు ఎలా అమలు చేయాలో తెలీదా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీని ఉద్దేశించి వ్యాఖ్యానిచింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు రాష్ట్రంలో తిరుగుతున్నారని అసలు రాష్ట్రంలో... ఏం జరుగుతోందని నిలదీసింది. పత్రికల్లో కథనాలు చూసి ఆశ్చర్య పోయామమని తెలిపింది. సెక్షన్ 144 ఎలా అమలు చేయాలో తెలీదా అని, మీరైనా వారికి సలహా ఇవ్వాలి కదా అని..అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌ను ప్రశ్నించింది.
 ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామనే సంగతి మరిచారా..?
సుప్రీంకోర్టు ఇటీవల ఏం తీర్పిచ్చిందో చూశారు కదా అని వ్యాఖ్యానించగా... పదే పదే 144 సెక్షన్ విధిస్తే అధికార దుర్వినియోగం అవుతుందని చెప్పిందంటూ...ఏజీ సమర్థించుకునేందుకు యత్నించారు. ఐతే మేమూ తీర్పు చదివామని,144 సెక్షన్‌ అమలు చేసే తీరిదేనా అని కోర్టు ప్రశ్నించింది. మహిళల పట్ల మగ పోలీసులు ఎలా వ్యవహరిస్తున్న ఫోటోలు,....200లకుపైగా పోలీసులు గ్రామంలో కవాతు చేస్తున్న వీడియో చూడాలని ఏజీకి సూచించిన హైకోర్టు,... కర్ఫ్యూ ఏమైనా విధించారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి నవ్వులాటలాగా ఉందా.? మనం ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నామనే సంగతి గుర్తుందా అని ప్రశ్నించింది. ప్రశాంతంగా నిరసన తెలియజేస్తుంటే..... మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారన్న కోర్టు నిరసన కార్యక్రమాల్ని నిర్వహించుకోనివ్వాలని స్పష్టం చేసింది.

శుక్రవారం ప్రమాణపత్రం దాఖలు చేయండి
విచారణ సందర్భంగా మిగతా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. పోలీసుల దమనకాండను ధర్మాసనం దృష్టికి తెచ్చారు. 144 సెక్షన్ విధింపు ఉత్తర్వులు.. ప్రజలకు అందుబాటులో ఉంచలేదని, ఆంక్షల ముసుగులో ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఓ న్యాయవాది చూపించిన ఫోటోలను చూసిన న్యాయమూర్తులు ఇళ్లలోకి వెళ్లి పోలీసులు ఇలాగేనా వ్యవహారించేది అని ప్రశ్నించింది. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించారనే అభియోగంపై కేసు నమోదుచేయడానికి అదొక్కటి చాలని పేర్కొంది. పోలీసులు కులం వివరాలు అడుగుతున్నారని, పూజలు నిర్వహించుకోవడానికి అనుమతివ్వడం లేదని తెలుపగా ఈ వ్యవహారాన్ని తాము చూసుకుంటామని తెలిపింది.  ఈ వివరాలన్నీ పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. శుక్రవారం ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది 
ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన  ఆదేశాలివే

  • జీవనోపాధి కోసం పనులకు వెళ్లే వారికి స్వేచ్ఛనివ్వాలి
  • శాంతియుత నిరసన ప్రదర్శనలకు అనుమతించాలి 
  • సంప్రదాయ పూజలు, ఆచార వ్యవహారాలను అడ్డుకోవద్దు 
  • తనిఖీల నిమిత్తం గ్రామస్తుల ఇళ్లల్లోకి ప్రవేశించొద్దు 
  • పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 46 నిబంధనలకు కట్టబడాలి 
  • ఠాణాల్లో అక్రమ నిర్బంధాలపై విచారణ జరపాలి
  • క్షతగాత్రులకు ప్రభుత్వమే వైద్యం అందించాలి
  • అరెస్టైన వారి జాబితా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందుంచాలి
  • నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి 
  • చట్ట ఉల్లంఘనపై చర్యలు ఎందుకు తీసుకోలేదో సీఎస్‌, డీజీపీ వివరణ ఇవ్వాలి 
  • 144 సెక్షన్ ఎందుకు విధించారో వివరణ ఇవ్వాలి 
Last Updated : Jan 14, 2020, 5:50 AM IST

ABOUT THE AUTHOR

...view details