High court on konaseema issue: కోనసీమ అల్లర్ల వ్యవహారంలో అమలాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో.. నిందితుడు అరిగెల వెంకటరామారావు, మరొకరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారి పిటిషన్లను కొట్టేసింది. అల్లర్లలో పిటిషనర్లది కీలక పాత్రని, సాక్షులు సైతం ఇదే విషయం వాంగ్మూలంలో చెప్పారని అదనపు పీపీ దుష్యంత్‌రెడ్డి కోర్టుకు విన్నవించారు. పిటిషనర్లను విచారించాల్సి ఉందని, వ్యాజ్యాల్ని కొట్టేయాలని కోరారు.
నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత.. కోనసీమ అల్లర్ల కేసులో హైకోర్టు ఉత్తర్వులు - కోనసీమ అల్లర్ల నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
High court on konaseema issue: కోనసీమ అల్లర్ల వ్యవహారంలో అమలాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో.. నిందితుల ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వారి పిటిషన్లను కొట్టేసింది.

కోనసీమ అల్లర్ల నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
ఆ వివరాలను పరిగణనలోకి తీసుకుని పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి కొట్టివేశారు. కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరుగా మార్చాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి: