ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వారిపై తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం

By

Published : Jan 8, 2021, 6:43 AM IST

పౌరహక్కుల సంఘం , కుల నిర్మూలన పోరాట సమితి , విరసం సభ్యులపై నమోదు చేసిన కేసుల్లో.. పిటిషనర్ల విషయంలో అరెస్ట్ తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తును కొనసాగించుకోవచ్చని తెలిపింది. మావోయిస్టులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న కారణంతో కేసులు పెట్టారని పౌరహక్కుల నేతలు పలువురు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు చేశారు.

high court
తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించిన హైకోర్టు

పౌరహక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, విరసం సభ్యులపై నమోదు చేసిన కేసుల్లో కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల విషయంలో అరెస్ట్, ఇతర తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టంచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దర్యాప్తును కొనసాగించుకోవచ్చని తెలిపింది .

ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మావోయిస్టులకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న కారణంతో కేసులు పెట్టారని పౌరహక్కుల నేతలు పలువురు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద విశాఖ జిల్లా ముంచంగిపుట్ట పోలీసులు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులుతమపై కేసులు నమోదు చేశారన్నారు. ప్రజల కోసం పనిచేసే వారిపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని న్యాయవాదులు వాదించారు. ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలొద్దని మధ్యంతర ఉత్తర్వులిచ్చారు .

ఇదీ చదవండి

ఏపీపీఎస్సీ పరీక్షలన్నీ అన్​లైన్​లోనే

ABOUT THE AUTHOR

...view details