ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

High Court: 'ఎస్ఈసీ నియామకానికి సంబంధించిన రికార్డులను సమర్పించండి'

ఎస్ఈసీ నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన రికార్డులను కోర్టు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ కార్యదర్శి, నీలం సాహ్ని తరఫు న్యాయవాదుల వాదలన కోసం విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

High Court
High Court

By

Published : Jul 29, 2021, 4:53 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలని గవర్నర్ ముఖ్యకార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ కార్యదర్శి, నీలం సాహ్ని తరఫు న్యాయవాదుల వాదలన కోసం విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరు పట్టణానికి చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కోవారెంటో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. తాజాగా జరిగిన విచారణలో గవర్నర్ విచక్షణాధికారం మేరకు ఎస్ఈసీని నియమించారని, పరిపాలనాపరమైన అనుభవం రిత్యా నీలం సాహ్నితో పాటు మరో రెండు పేర్లను ముఖ్యమంత్రి .. గవర్నర్‌కు సూచించినట్లు గవర్నర్ ముఖ్యకార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ పేర్లకు కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరం గవర్నర్​పై లేదని.. మొత్తం 11 మంది పేర్ల పరిశీల అనంతరం ఆమెను ఎఈసీగా నియమించినట్లు తెలిపారు. ఎస్ఈసీ నియామకం పారదర్శకంగా జరిగిందన్నారు. ఎస్ఈసీగా నియామకానికి ముందు ఆమె ప్రభుత్వంతో పనిచేశారని... ముఖ్యమంత్రికి సలహాదారుగా వ్యవహరించారనే కారణంతో స్వతంత్ర వ్యక్తి కాదని పిటిషనర్ ఆరోపించడం సరికాదన్నారు. ఎస్ఈసీగా ఆమె బాధ్యతలు చేపట్టేనాటికి ఏ విధమైన పోస్టులో లేరని.. కోవారెంటో పిటిషన్​పై డివిజన్ బెంచ్ విచారణ జరపి ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేయాలని గవర్నర్ ముఖ్యకార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి కోరారు.


ఇదీ చదవండి
దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు..

ABOUT THE AUTHOR

...view details