ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అత్యవసరమైతేనే కేసులు విచారిస్తాం: హై కోర్టు - High Court judges meeting News

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా రెండు వారాల పాటు అత్యవసర వ్యాజ్యాలపై మాత్రమే విచారణలు జరపాలని హైకోర్టు నిర్ణయించింది. మరోవైపు కోర్టుకు వచ్చే న్యాయవాదులు, సిబ్బందికి.. థర్మల్‌ గన్‌లతో పరీక్షలు జరపనున్నారు.

అత్యవసరమైతేనే విచారణ
అత్యవసరమైతేనే విచారణ

By

Published : Mar 17, 2020, 10:36 AM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి, హైకోర్టు న్యాయమూర్తులందరితో(ఫుల్‌కోర్ట్‌) కలిసి కరోనా విస్తృతిపై చర్చించారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీజే పాల్గొన్నారు. ఆ తర్వాత న్యాయవాదుల సంఘం హాలులో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యక్తిగత హాజరు కావాలని అధికారుల్ని ఆదేశించిన కేసులు, బెయిల్‌, దిగువ కోర్టులు విధించిన శిక్షలపై కేసులు తదితర తాజా వ్యాజ్యాలపై విచారణలు ఉంటాయన్నారు. మిగిలిన వాటిలో అత్యవసర విచారణ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ కేసులను న్యాయమూర్తులు పరిశీలించి విచారణలు జరుపుతారని చెప్పారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు పొడిగిస్తామన్నారు.

ఒకేచోట సమావేశాలొద్దు

కోర్టు ప్రాంగణం, కోర్టు గదులు, కార్యాలయాల్లో న్యాయవాదులందరు ఒకేచోట సమావేశాలు నిర్వహించొద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూరి జస్టిస్‌ జేకే మహేశ్వరి విజ్ఞప్తి చేశారు. సమూహాలుగా తిరగొద్దన్నారు. సుప్రీంకోర్టుతో జరిపిన చర్చలో బార్‌ అసోసియేషన్లను మూసివేయాలనే అంశంపై చర్చరాగా అది సాధ్యంకాదని సూచన చేశామన్నారు. హైకోర్టు పరిమితమైన విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడానికి నిర్ణయించామన్నారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు, మాస్క్‌లు ఏర్పాట్లు చేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రవిప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావుకు విజ్ఞప్తి చేశారు. అధిక జ్వరంతో బాధపడుతున్న న్యాయవాదులు, కక్షిదారులు కోర్టుకు రావొద్దని సూచించారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని.. కేసులు కొట్టివేయబోమని తెలిపారు. కోర్టు సిబ్బందిని బయోమెట్రిక్‌ హాజరు కోసం రిజిస్ట్రీ బలవంతపెట్టకూడదన్నారు. ఈ సూచనలు 2 వారాల పాటు అమల్లో ఉంటాయన్నారు.

దిగువ కోర్టుల్లోనూ..

బెయిల్‌, కింది కోర్టు విధించిన శిక్షలపై అప్పీల్‌, విచారణ ఖైదీల కేసుల్లో సాక్ష్యాల నమోదు, విచారణ తప్పని సరి అని భావించిన కేసుల్లో దిగువ కోర్టుల్లో విచారణలు జరపాలని హైకోర్టు సీజే సూచించారు. నిందితుల రిమాండ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పొడిగించాలన్నారు.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details