ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆస్తుల నమోదు, ఆధార్ సేకరణ చట్టబద్దం కాదని పిటిషనర్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం స్టేను రేపటివరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై రేపు వాదనలు కొనసాగనున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల నమోదు చేయవద్దని ఇప్పటికే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ: వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే రేపటి వరకు పొడిగింపు - ధరణిపై స్టే పొడిగింపు
ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం స్టేను రేపటి వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే రేపటి వరకు పొడిగింపు