ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకున్నారు?: హైకోర్టు - uddanam latest news

ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించేందుకు దీర్ఘకాలిక చర్యలు ఏమి తీసుకున్నారో తెలియజేస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

high court comments on uddanam issue
ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యలపై హైకోర్టులో విచారణ

By

Published : Jan 8, 2021, 7:15 AM IST


ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యను పరిష్కరించేందుకు దీర్ఘకాలిక చర్యలు ఏం తీసుకున్నారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్కారు చేపట్టిన చర్యలను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నామని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

దశాబ్దాల తరబడి శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల్లో కిడ్నీ వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారని పేర్కొంటూ న్యాయవాది సింహాచలం 2019లో హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.

ABOUT THE AUTHOR

...view details