ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అయ్యన్నపాత్రుడి వ్యక్తిగత స్వేచ్ఛలో.. పోలీసులు జోక్యం చేసుకోవద్దు : హైకోర్టు - అయ్యన్నపాత్రుడు తాజా వార్తలు

HC ON AYYANNA CASE: తెదేపా నేత అయ్యన్నపాత్రుడు కేసు విషయంలో పోలీసులను హైకోర్టు మరోసారి నిలదీసింది. అయ్యన్నపై ఏ కేసూ లేకపోతే.. ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించింది. ఏదైనా కేసు నమోదు అయి ఉంటే..చట్ట ప్రకారం వ్యవహరించాలంది. వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దని.. పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది.

HC ON AYYANNA CASE
HC ON AYYANNA CASE

By

Published : Jul 1, 2022, 8:26 AM IST

HC ON AYYANNA CASE: తెదేపా సీనియర్ నేత.. అయ్యన్నపాత్రుడి వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవద్దని.. పోలీసులకు హైకోర్టు స్పష్టం చేసింది. అయ్యన్నపై ఏ కేసు లేకపోతే.. ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించింది. ఏదైనా కేసు నమోదు అయి ఉంటే.. చట్ట ప్రకారం వ్యవహరించాలంది. వివిధ ఠాణాల్లో అయ్యన్నపై నమోదు చేసిన కేసుల వివరాలను.. కోర్టు ముందు ఉంచాలని హోంశాఖను ఆదేశిస్తూ.. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్ర.. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. వివిధ ఠాణాల్లో తనపై నమోదు చేసిన కేసుల వివరాలను బహిర్గతం చేయకుండా, పోలీసులు తన వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ.. అయ్యన్నపాత్రుడు అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. రాజకీయ కక్షతో అయ్యన్నను ప్రభుత్వం వేధిస్తోందని, ఇంటి ప్రహరీగోడను కూల్చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదన వినిపించారు. తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలపగా.. కేసు నమోదు చేయనప్పుడు పోలీసులు ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం .. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

న్యాయస్థానాల వల్లే బతికున్నా:న్యాయస్థానాలు ఉండబట్టే ఇంకా బతికున్నానని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. న్యాయ వ్యవస్థ లేకుంటే ఈ మూడేళ్ల కాలంలో తనలాంటి ఎందరో నేతలను వైకాపా నాయకులు చంపేసి ఉండేవారని అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్​ఐఆర్​ రాయకుండా కేసులు పెట్టే దుష్ట సంస్కృతికి వైకాపా ప్రభుత్వం తెరలేపుతోందని ధ్వజమెత్తారు. అయితే రాష్ట్రం కోసం మాట్లాడి తీరుతాం, ఏం చేస్తారో చేసుకోండని అయ్యన్నపాత్రుడు అధికార పార్టీ నేతలకు సవాల్ విసిరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details