ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2020, 6:07 AM IST

ETV Bharat / city

స్వేచ్ఛతోనే సరైన న్యాయం: హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి

న్యాయవ్యవస్థలో నిర్ణయం వెల్లడించడానికి నిష్పాక్షికత, స్వతంత్రత, సహేతుకత అనేవి ముఖ్య లక్షణాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి పేర్కొన్నారు. జోక్యం, ఒత్తిళ్లు లేని స్వేచ్ఛాయుత వాతావరణం ఉన్నప్పుడే సరైన న్యాయం చేస్తారన్నారు. స్వతంత్రత అనేది న్యాయవ్యవస్థ ప్రాథమిక నిర్మాణంలో భాగమని.. దాన్ని బాహ్యశక్తుల అనవసర జోక్యంతో నీరుగార్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

high court cj justice maheshwari on independence day
high court cj justice maheshwari on independence day

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం హైకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. భారత రాజ్యాంగం ప్రజలందరికీ న్యాయం పొందేందుకు హక్కు కల్పించినా కొందరికి మాత్రమే న్యాయం దక్కుతోందన్నారు. న్యాయం చేయడంలో జాప్యం, అసమర్థత చోటు చేసుకుంటే ఆ తీర్పు విలువ కోల్పోతుందని ప్రజలు విశ్వసిస్తారన్న జస్టిస్‌ బర్గర్‌ మాటల్ని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ ప్రకటించాక దేశంలో వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణలు ప్రారంభించిన మొదటిది ఏపీˆ హైకోర్టేనని తెలిపారు. మార్చి 26 నుంచి ఇప్పటి వరకు 27,462 వ్యాజ్యాల్లో ఆన్‌లైన్‌ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టి.. 5,241 కేసుల్ని పరిష్కరించిందన్నారు. కేసుల విచారణ ఆగకూడదన్న స్ఫూర్తితో దీన్ని సాధించగలిగామన్నారు. హైకోర్టు ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ బి.రాజశేఖర్‌, వీఆర్‌ సెక్షన్‌ అసిస్టెంట్ ఎస్‌.ప్రసాద్‌నాయక్‌ మృతికి నివాళులర్పించారు. అడ్వొకేట్ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, ఏపీˆ న్యాయవాదుల మండలి ఛైర్మన్‌ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యదర్శి జేయూఎంవీ ప్రసాద్‌ ప్రసంగించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు. కరోనా బారినపడి కోలుకున్న కోర్టు సిబ్బంది, అధికారులను.. వారికి చికిత్స అందించిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి వైద్యులను సన్మానించారు. కోర్టు టెలిఫోన్‌ డైరెక్టరీని సీˆజేతో కలిసి న్యాయమూర్తులు ఆవిష్కరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details