కరోనా సమయంలో న్యాయవ్యవస్థ అంతా.. ఓ కుటుంబంలా అందరూ ఒకరికొకరు తోడుగా సహకరించుకుంటూ పనిచేయాలని హైకోర్టు తెలిపింది. ఈ కష్టకాలంలో న్యాయవ్యవస్థకు మూల స్తంభాలైన న్యాయాధికారులు, సిబ్బందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తరఫున ఈ సందేశాన్ని తెలియజేస్తున్నానన్నారు. హైకోర్టు, దిగువ న్యాయస్థానాలకు సంబంధించిన న్యాయమూర్తులు, సిబ్బంది.. వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేయవలసిన సమయం వచ్చిందన్నారు.
సారాంశం
'ప్రజల హక్కుల్ని కాపాడే విషయంలో కోర్టులు పనిచేయడం తప్పనిసరి అనేది గుర్తించుకోవాలి. ఆరోగ్య , పురపాలక , నీటి సరఫరా , విద్యుత్ , పోలీసు తదితర విభాగాలు ముందు వరసలో ఉండి పనిచేస్తున్న తరహాలోనే న్యాయవ్యవస్థ పనిచేయాలి. న్యాయ సేవలను నిరాకరించలేము. కరోనా అంటువ్యాధి అని , చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకున్న సమాచారం ప్రకారం ఏపీలో కరోనాను ఎదుర్కొని కోలుకున్న వారు 98 శాతం కంటే ఎక్కు ఉంది. హైకోర్టు అధికారులకు , సిబ్బందికి చేసిన పరీక్షల్లో 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారందరు నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు.