High Court: కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంవల్ల ఎంతమంది రైతులు నష్టపోయారు.. భూముల విస్తీర్ణం వివరాలు, ఇంకా ఎంతమందికి పరిహారం అందాలన్న వివరాలను తెలియజేయాలని పిటిషనరుకు హైకోర్టు సూచించింది. ప్రభుత్వం వేసిన కౌంటరుకు తిరుగు సమాధానం (రిప్లై) ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకు పోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని భాజపా నాయకులు ఎన్.రమేశ్ నాయుడు హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. విపత్తులు సంభవించినప్పుడు పరిహారం చెల్లింపుపై సుప్రీంకోర్టు ఏమైనా ఆదేశాలు ఇచ్చి ఉంటే వాటిని కోర్టు ముందుంచాలని పిటిషనరుకు సూచించింది. విచారణను వాయిదా వేసింది.
High Court: పరిహారం వివరాలు తెలపండి: హైకోర్టు - ఏపీ తాజా వార్తలు
High Court: కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంవల్ల ఎంతమంది నష్టపోయారో, ఎందరికి పరిహారం అందిందో వివరాలు తెలపాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు... తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
రాష్ట్ర హైకోర్టు