ఎన్నికల కమిషన్ వ్యవహారాలకు సంబంధించి ఇదో చారిత్రక తీర్పని న్యాయవాది నర్రా శ్రీనివాస్ అన్నారు. హైకోర్టు అమరావతికి వచ్చాక ఎక్కువమంది న్యాయవాదులు వాదనలు వినిపించిన కేసు ఇదేనని శ్రీనివాస్ తెలిపారు. రాజ్యాంగబద్ధమైన అంశాలను మార్చడం సరికాదని కోర్టు చెప్పిందన్నారు. రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉంటారని కోర్టు స్పష్టం చేసిందని న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు.
ఇదో చారిత్రక తీర్పు: న్యాయవాది శ్రీనివాస్
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా ఉంటారని హైకోర్టు తేల్చి చెప్పిందని న్యాయవాది శ్రీనివాస్ వెల్లడించారు.
న్యాయవాది శ్రీనివాస్