పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటితో 550వ రోజుకు చేరింది. కరోనా పరిస్థితుల్లోనూ రైతులు, మహిళలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 550 రోజు సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి నివాసం ముట్టడించేందుకు యత్నిస్తున్నారన్న సమాచారంతో ….. తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి పరిధిలో పోలీసులు హైఅలర్ట్ విధించారు. భారీగా బలగాలను మోహరించారు. అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ స్వయంగా రంగంలోకి దిగారు. చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ప్రకాశం బ్యారేజీ, తాడేపల్లి వద్ద వారధి, ఎన్టీఆర్ మార్గ్ రహదారుల్లో అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. శనివారం ఎలాంటి ఆందోళనలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం ఇంటి పరిధిలో కొత్త వారికి ఎవరికైనా ఆశ్రయం కల్పిస్తే వారి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఐకాస ముఖ్య నేతల ఇంటి వద్ద పోలీసులు మఫ్టీలో పికెటింగ్ ఏర్పాటుచేశారు. మహిళా ఐకాస నేత సుంకర పద్మశ్రీ ఇంటి వద్ద మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
నేటితో 550వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం.. సీఎం ఇంటి వద్ద హై అలర్ట్ - రేపటితో 550వ రోజుకు అమరావతి ఉద్యమం న్యూస్
అమరావతి మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 550 రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో జగన్ నివాసం పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు.
రేపటితో 550వ రోజుకు అమరావతి ఉద్యమం
Last Updated : Jun 19, 2021, 12:04 AM IST