ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

heroine Kajal: వరంగల్​లో కాజల్​ దంపతుల సందడి.. తెలుగులో మాట్లాడిన ముద్దుగుమ్మ - Warangal latest news

తెలంగాణలోని వరంగల్​లో ముద్దుగుమ్మ కాజల్​ సందడి చేశారు. తన భర్తతో కలిసి ఓ షాపింగ్​మాల్​ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కాజల్​... అభిమానులతో తెలుగులో మాట్లాడి అభిమానులను ఉత్సాహపరిచారు.

heroine Kajal at warangal
వరంగల్​లో కాజల్​ సందడి

By

Published : Aug 13, 2021, 6:29 PM IST

వరంగల్​లో కాజల్​ సందడి

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ నగరంలో హీరోయిన్ కాజల్‌ సందడి చేశారు. నగరంలోని ఓ వస్త్రాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన ముద్దుగుమ్మ తన భర్తతో కలిసి సందడి చేశారు. భర్తతో కలిసి జ్యోతి వెలిగించి.. షాపింగ్​మాల్​ను ప్రారంభించారు. వస్త్రాలయంలో కలియ తిరుగుతూ పలు డిజైన్ల దుస్తులను పరిశీలించారు. విభిన్న రకాల చీరలను ప్రదర్శిస్తూ.. ఫొటోలకు పోజులిచ్చారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కూమార్, ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్‌భాస్కర్​తో కలిసి వస్త్రాలయాన్ని ప్రారంభించారు.

అందాల తార కాజల్​ను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కాజల్​ జోష్ నింపారు. తెలుగులో మాట్లాడుతూ అభిమానుల్లో ఉత్సాహం పెంచారు. వరంగల్‌ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన భర్తకు వరంగల్​ అంటే చాలా ఇష్టమని.. అందుకే తన వెంట వచ్చినట్టు అభిమానులతో పంచుకుంది. తనపై ఎంతో ప్రేమ చూపిస్తున్న వరంగల్​ వాసులకు, అభిమానులకు ముద్దగుమ్మ కృతజ్ఞతలు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details