'తాను వెళ్తున్న సమయంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టారని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ అన్నారు. దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా సాగిన్నట్లు హేమ పేర్కొన్నారు.
ఇక తనకూ బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని నటుడు శివబాలాజీ అన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తుంటే వాగ్వాదం మాత్రమే జరిగినట్లు తెలిపారు. హేమ కొరికిన విషయాన్ని నో బైటింగ్.. ఓన్లీ ఓటింగ్' అంటూ' తేలిగ్గా కొట్టి పారేశారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈసారి 'మా' సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఏడాది మొత్తంగా 665 మంది ఓటు వేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతోపాటు గిరిబాబు, చలపతిరావు, బాబుమోహన్, బ్రహ్మానందం వంటి సీనియర్ నటులు, రోజా, జయప్రద, జెనీలియా, అఖిల్, నాని.. ఇలా ఎంతో మంది సినీ తారలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.