ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల భద్రత కోసం తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిల్‌లో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని.. తనకు సందేశాలు పంపిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వారందరికీ వీలైనంత త్వరగా దేశానికి రప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దిల్లీతో పాటు.. సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్లు..
యుద్ధభూమిలో చిక్కుకుపోయిన విద్యార్థులకు సహాయం అందించేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. దిల్లీతోపాటు.. సచివాలయంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు.. సెక్రెటరేట్‌లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీల వివరాలను సోమేష్ కుమార్ వెల్లడించారు.
దిల్లీ తెలంగాణ భవన్‌లో సంప్రదించాల్సిన నెంబర్లు..
విక్రమ్‌సింగ్‌మాన్ : +91 7042566955
చక్రవర్తి పీఆర్ఓ : +91 9949351270
నితిన్ ఓఎస్డీ : +91 9654663661