ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆదుకుంటున్న ఆపన్నహస్తాలు - ఆంధ్రప్రదేశ్ నేటి వార్తలు

లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. వారికి తోచినంత సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

helping-to-poor-pople-whio-faced-lot-of-problems-in-lockdown-period
ఆదుకుంటున్న ఆపన్నహస్తాలు

By

Published : May 26, 2020, 5:19 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో...

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరం కూడలిలో నరసింహరాజు, వేణుగోపాల రాజు ఆధ్వర్యంలో 800 మంది వలస కూలీలకు భోజనం, పండ్లు, తాగునీటి ప్యాకెట్లు అందించారు. వేమగిరి సర్వరాయ షుగర్స్ ప్రతినిధులు శీతల పానీయాలను ఉచితంగా అందజేశారు.

అనంతపురం జిల్లాలో...
అనంతపురం జిల్లా కదిరిలో నిరుపేదలైన క్షౌర వృత్తిదారులు, నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను పలువురు ప్రశంసించారు.

ప్రకాశం జిల్లాలో...

ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన ఓ వ్యాపారి తన సొంత నిధులతో నిత్యం 5 వేల మందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. లాక్​డౌన్ కారణంగా 216 నంబర్ జాతీయరహదారిపై వెళ్తున్న వలస కూలీలు, వాహనదారుల ఇబ్బందులు చూసి వారికి సహాయపడదామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దాత తెలిపారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరులోని 44వ వార్డు గౌతమినగర్​లో 250 కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. అత్యవసర సేవలందిస్తున్న వారి కృషి మరవలేనిదని స్థానిక ఎమ్మెల్యే గిరి అన్నారు.

ఇదీచదవండి.

కరోనా సడలింపులపై పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ

ABOUT THE AUTHOR

...view details