నాగార్జున సాగర్ సాగర్ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో పులిచింతలకు నీటి ప్రవాహం పెరిగింది. ఇన్ ఫ్లో 3,27,512 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటి మట్టం 175 అడుగులుగా కాగా... ప్రస్తుతం 170.27 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 38.74 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో 2,67,775 క్యూసెక్కులుగా ఉంది.
ప్రకాశం బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి దిగువకు 2,76,996 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బ్యారేజీ ఇన్‌ఫ్లో 2,18,325 క్యూసెక్కులు కాగా... ప్రస్తుత నీటినిల్వ 2.8 టీఎంసీలుగా ఉంది.