తెలంగాణ జరుగుతున్న మేడారం సమ్మక్క-సారక్క జాతరకు తరలొస్తున్న భక్తులతో పుచ్చకాయ, కీరదోసకు మంచి గిరాకీ ఏర్పడింది. తల్లుల దర్శనం కోసం గంటల కొద్ది లైన్లలో నీరు, ఆహారం లేకుండా గడుపుతున్న భక్తులు... దర్శనానంతరం బయటికి వచ్చి ఆకలితో పాటు దాహార్తి తీర్చుకునేందుకు నీటి శాతం అధికంగా ఉన్న పుచ్చకాయ, కీరదోసను ఆశ్రయిస్తున్నారు.
మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు - మేడారం జాతర 2020
తెలంగాణలో మేడారం సమ్మక్క-సారక్క జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలొస్తున్న భక్తులు లైన్లలో నిలబడి నీరసపడిపోతున్నారు. ఆ నీరసం నుంచి కోలుకొవడానికి నీటి శాతం అధికంగా ఉన్న కీరదోస, పుచ్చకాయల వైపు భక్తులు తరలిపోతున్నారు.
మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు
ఫలితంగా ఎక్కడ చూసిన పుచ్చకాయ బండ్ల వద్ద భక్తులు అధికంగా కనబడుతున్నారు. నెల రోజుల్లో అమ్మే సరుకులను కేవలం ఒక్క రోజులోనే అమ్ముకుంటూ లాభాలను గడిస్తున్నారు చిరువ్యాపారులు.