ఏపీ పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్లో 48.07శాతం సీట్లే భర్తీ అయ్యాయి. కేటాయింపు వివరాలను కన్వీనర్ ఎం.ఎం నాయక్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటులో కలిపి 72,713 సీట్లు ఉండగా.... 34,956 మాత్రమే నిండాయి. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి... అందర్నీ ఉత్తీర్ణులు చేసినందున సీట్ల భర్తీ పెరుగుతుందని భావించగా...ఈసారి గతేడాది కంటే సీట్ల భర్తీ తగ్గడం విశేషం.క్రీడా ధ్రువపత్రాల పరిశీలన పూర్తి కానందున ఈ కోటా కింద326 మందికి సీట్ల కేటాయింపును వాయిదా వేశారు. గతేడాది 55.37శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
పాలిసెట్లో భారీగా మిగిలిన సీట్లు - ఏపీ పాలిసెట్లో మిగిలిన సీట్లు
ఏపీ పాలిసెట్లో ఈ ఏడాది సీట్లు భారీగా మిగిలాయి. రాష్ట్రవ్యాప్తంగా 72వేలకు పైగా సీట్లు ఉండగా... కేవలం 36,956 మాత్రమే నిండాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కన్వీనర్ ఎం.ఎం. నాయక్ విడుదల చేశారు.
ap polycet 2020