ఇవాళ, రేపు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక - Heavy rains today and tomorrow
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. ఇవాళ, రేపు అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కరిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రానున్న 4 రోజుల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడుతాయని పేర్కొంది.