ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది. ఇది క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియచేసింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఈ నెల 12వ తేదీ ఉదయానికి...విశాఖకు ఎగువన తీరాన్ని దాటే అవకాశమున్నట్టుగా ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు
గుంటూరు | బొల్లాపల్లె | 8.1 సె.మీ |
గుంటూరు | రొంపిచర్ల | 4.5 సె.మీ |
తూర్పుగోదావరి | ఏలేశ్వరం | 5.4 సె.మీ |
శ్రీకాకుళం | రాజాం | 5 .0సె.మీ |
అనంతపురం | పామిడి | 6.2 సె.మీ |
విశాఖ విశాఖ | నక్కపల్లి |