ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

telangana weather updates: రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు! - rain update in telangana

రేపు, ఎల్లుండి తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో భారీ, అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

telangana weather updates
తెలంగాణలో భారీ వర్షాలు

By

Published : Jul 15, 2021, 7:14 PM IST

తెలంగాణలో భారీ వర్షాలు

తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తున కొనసాగుతోంది.ఫలితంగా తెలంగాణలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపారు.

బుధవారం.. హైదరాబాద్​ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జోరు వానలు కురిశాయి. భాగ్యనగరంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతూ.. వాన నీరు, డ్రైనేజీ నీళ్లు కలిసి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల అపార్టుమెంట్ల సెల్లార్లలో నీరు చేరింది. నిత్యావసర సరకులకు వెళ్లేందుకు సైతం ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details