ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర్ కు భారీ వరద... 14 క్రస్టు గేట్లు ఎత్తివేత

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద పెరిగింది. నాగార్జునసాగర్‌కు భారీఎత్తున వరద వచ్చిచేరుతుండడం వల్ల 14 క్రస్టుగేట్లు 10 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Nagarjuna sagar dam
http://Nagarjuna sagar dam//telangana/14-September-2020/tg-nlg-41-14-sagar-14gets-open-av-ts10064_14092020214832_1409f_1600100312_687.jpg

By

Published : Sep 15, 2020, 10:05 AM IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణాన దిలో వరద పెరిగింది. నాగార్జునసాగర్‌కు భారీఎత్తున వరద వచ్చి చేరుతుండడం వల్ల 14 క్రస్టు గేట్లను 10 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు ఇన్‌ఫ్లో 2లక్షలా 47వేల 700 క్యూసెక్కులు వచ్చిచేరుతుండగా... అంతేనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 311.80 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 589.50 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వచ్చే వరదలో హెచ్చుతగ్గులను బట్టి అధికారులు సాగర్ క్రస్ట్‌గేట్లను ఎత్తడం, దించడం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details