భారీ వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు.. పరవళ్లు తొక్కుతున్నాయి. సాధారణం కంటే అనంతపురం జిల్లాలో 109.1%, చిత్తూరులో 107.9%, కర్నూలులో 100.6%, కడపలో 53% చొప్పున అధిక వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ ఆరంభం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ సాధారణం కన్నా 40.3% అధిక వర్షం కురిసింది. పశ్చిమ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వేరుసెనగ ఏపుగా పెరుగుతోంది. దానితోపాటే కలుపు మొక్కలూ పెరుగుతుండటం రైతులకు ఇబ్బందిగా తయారైంది. కలుపు తీయించాలంటే ఎకరాకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు అవుతోంది. ఆ ఖర్చు భరించలేక వేరుసెనగనే వదిలేస్తున్నామని తంబళ్లపల్లి మండలంలోని కొందరు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలో ఆస్పిరి, పత్తికొండ, ఆలూరు, హాళహర్వి తదితర ప్రాంతాల్లో పత్తి పొలాల్లో తడి ఆరకపోవడంతో అరకలు సాగడం లేదు. పత్తి చేలల్లో నీరు ఊరుతూ కలుపు సమస్య ప్రబలుతోందన్నారు.
భారీ వర్ష సూచన
వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం డైరెక్టర్ స్టెల్లా సూచించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో 2.1 కి.మీ. ఎత్తు నుంచి 3.6 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వివరించారు.
సీమలో సమృద్ధిగా వానలు... సాధారణం కంటే 100 శాతంపైనే వర్షపాతం - రాయలసీమలో వానలు
భారీ వర్షాలతో రాయలసీమలో వాగులు, వంకలు.. పరవళ్లు తొక్కుతున్నాయి. ఖరీఫ్ ఆరంభం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ సాధారణం కన్నా 40.3% అధిక వర్షం కురిసింది.
సీమలో సమృద్ధిగా వానలు