తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చొప్పదండి, రామడుగు, మానకొండూరు, పెగడపల్లి, శంకరపట్నం, సుల్తానాబాద్ మండలాల్లో ఈదురు గాలులతో వానపడుతోంది. ఫలితంగా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Live Video: కరీంనగర్‌లో భారీ వర్షం.. కూలిన 70 అడుగుల ఎత్తైన లుమినార్ - కరీంనగర్‌లో కూలిన భారీ లుమినార్
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. చొప్పదండి, రామడుగు, మానకొండూరు, పెగడపల్లి, శంకరపట్నం, సుల్తానాబాద్ మండలాల్లో ఈదురు గాలులతో వానపడుతోంది.
కరీంనగర్‌లో భారీ వర్షం
ఈదురుగాలుల ధాటికి గీతాభవన్ వద్ద 70 అడుగుల ఎత్తులో కట్టెలతో ఏర్పాటుచేసిన భారీ లుమినార్ కుప్పకూలింది. ఫిబ్రవరిలో జరగనున్న శ్రీ వెంకటేశ్వర ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ హోర్డింగ్ ఏర్పాటుచేశారు. సుమారు రూ.45 లక్షల రూపాయలతో రాముడి పట్టాభిషేక దృశ్యాలను ఆవిష్కరించేలా విద్యుత్‌దీపాలతో హోర్డింగ్ నిర్మించగా అకాల వర్షాలతో కుప్పకూలింది.