ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భద్రాచలంలో భారీ వర్షాలు.. ఉద్ధృతంగా గోదావరి - భద్రాచలంలో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి నది ప్రవాహం పెరగడంతో స్నానఘట్టాలు వరద నీటిలో మునిగాయి. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు దాటితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

heavy rains in badrachalam
భద్రాచలంలో భారీ వర్షాలు.. ఉద్ధృతంగా గోదావరి

By

Published : Aug 13, 2020, 8:11 PM IST

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది. ఉదయం 32.7 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నానికి 34.5 అడుగులు దాటి ప్రవహిస్తోంది. గోదావరి నది ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం పరవళ్లు తొక్కుతోంది. జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 18 గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు.

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీళ్లు వస్తున్నందున భద్రాచలంలో ఇంకా నీటి మట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు చెబుతున్నారు. ప్రవాహం పెరగడంతో స్నానఘట్టాలు మునిగాయి. భద్రాచలంలో నీటి మట్టం 43 అడుగులకు దాటితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details