'రాష్ట్రంలో భారీ వర్షాలు-అప్రమత్తంగా ఉండండి'
రాష్ట్రంలో మరో 24 గంటలపాటు భారీ వర్షాలు వడే సూచనలున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ తెలిపారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో.... విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
'రాష్ట్రంలో భారీ వర్షాలు-అప్రమత్తంగా ఉండండి'
.
Last Updated : Oct 30, 2019, 5:14 PM IST