Heavy Rains: ఒడిశా- కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది మరింతగా బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య దిశగా కదులుతూ ఛత్తీస్‌గఢ్, ఒడిశాపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈనెల 9, 10 తేదీల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది.
Heavy Rains: కొనసాగుతున్న అల్పపీడనం.. 24 గంటల్లో అక్కడ భారీ వర్షాలు - తెలంగాణలో భారీ వర్షాలు
Heavy Rains: రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వచ్చే 24గంటల్లో బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని.. తెలిపింది. దీని ప్రబావంతోరాగల కోస్తాంధ్రతోపాటు... తెలంగాణా, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
![Heavy Rains: కొనసాగుతున్న అల్పపీడనం.. 24 గంటల్లో అక్కడ భారీ వర్షాలు Heavy Rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16046000-650-16046000-1659943075540.jpg)
భారీ వర్షాలు