ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా పొంగుతున్న వాగులు, వంకలు

రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. రాకపోకలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

heavy rains
heavy rains

By

Published : Sep 19, 2020, 9:41 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. రోడ్లపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద జింకలవంక వాగు భారీ వరదతో పారుతోంది. వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. రోడ్డు దాటే క్రమంలో కొట్టుకుపోతున్న ఓ ద్విచక్రవాహనదారుడిని స్థానికులు రక్షించారు.

కుంగిన వంతెన...

కడప జిల్లా కమలాపురం మండలం గొల్లపల్లి వద్ద వంతెన కుంగిపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి వంతెన కుంగినట్లు స్థానికులు తెలిపారు.

కొట్టుకుపోయిన కారు..

చిత్తూరు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు అలుగువాగు జోరుగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహ దాటికి ఓ కారు కొట్టుకుపోయింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా కారులో ఉన్న ఇద్దరిని కాపాడారు.

ఇదీ చదవండి:

వైకాపాలోకి విశాఖ తెదేపా ఎమ్మెల్యే?

ABOUT THE AUTHOR

...view details