Weather Alerts in Andhra Pradesh : ఉత్తరాంధ్ర పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 4 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో డిసెంబర్ 3 , 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
WEATHER ALERTS IN ANDHRA PRADESH : బంగాళాఖాతంలో అల్పపీడనం...ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిభారీ వర్షాలు - bay of bengal
Weather Alerts in Andhra Pradesh : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 4 నాటికి తుపానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
![WEATHER ALERTS IN ANDHRA PRADESH : బంగాళాఖాతంలో అల్పపీడనం...ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిభారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13781897-656-13781897-1638307616226.jpg)
బంగాళాఖాతంలో అల్పపీడనం
దక్షిణ థాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి... డిసెంబర్ 2 నాటికి వాయుగుండంగా బలపడనుంది. డిసెంబర్ 3న మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. తర్వాత ఇది వాయువ్య దిశగాలో ప్రయాణించి....మరింత బలపడుతూ నాల్గో తేదీ నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలను చేరే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
ఇదీచదవండి.